Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాబోయే కాలంలో గ్రీన్ ఖమ్మంగా చూడటమే ధ్యేయం
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-గాంధీచౌక్
మన పరిసరాలను బాగు చేసుకునేందుకే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమమని, పల్లె, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలకు మహర్దశ వచ్చిందని, పట్టణాలు ఆధునీకరణ చెంది ప్రజల జీవనశైలి మెరుగుపడిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ అన్నారు. శుక్రవారం నగరంలోని 13, 26వ డివిజన్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వి.కర్ణన్, నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి పాల్గొని మంత్రి మొక్కలు నాటారు. హరితహారంలో ప్రతి ఒక్కరు స్వచ్చందంగా పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వయం పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల ఆలోచన అని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారన్నారని మంత్రి తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా 13, 26వ డివిజన్లలో మంత్రి అధికారులు, ప్రజాప్రతి నిధులతో కలిసి విస్తతంగా పర్యటించి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. 90 శాతం మొక్కలను చెట్టుగా ఎదిగే వరకు కాపాడాల న్నారు. నాటిన మొక్కలు వృక్షాలైతే రాబోయే కాలంలో ఖమ్మంను గ్రీన్ ఖమ్మంగా చూడనున్నామని అన్నారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీ నారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ అనురాగ్ జయంతి, శిక్షణ కలెక్టర్ బి.రాహుల్, ఆర్.డి.ఓ రవీంధ్రనాథ్, అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, తహశీల్దారు శైలజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ, కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, మందడపు లక్ష్మీ మనోహర్, దందా జ్యోతి రెడ్డి, దాదే అమృతమ్మ, సతీష్, ఆళ్ల నిరీషా అంజిరెడ్డి, గజ్జల లక్ష్మీ పాల్గొన్నారు.