Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసులకు ఫిర్యాదు చేసిన నాయకులు
నవతెలంగాణ-కారేపల్లి
తెలంగాణ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెల్పుతూ కారేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సినిమా హాల్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, బస్టాండ్ సెంటర్, పోలీసుస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయటంలో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఎదుగుదలను ఓర్వలేక, కొందరి పునాదులు కదులుతాయని భయంతో ప్లెక్సీలను చించివేశారని కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, దారావత్ భద్రునాయక్లు ఆరోపించారు. ప్లెక్సీ చించటం పిరికిపందా చర్య అని వారు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ అంటే భయపడి అఘాంతకులు ఈ చర్యలు పాల్పడ్డారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే మరింత ప్రజావ్యతిరేకత చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్లెక్సీలను చించివేతపై కారేపల్లి పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సొసైటీ డైరక్టర్ బానోత్ హీరాలాల్,, నాయకులు సురేందర్ మనియార్, గుగులోత్ భీముడు, మేదరి వీరప్రతాఫ్(టోనీ), తాజుద్దీన్, అజీజ్‌ఖాన్, జానీ తదితరులు పాల్గొన్నారు.