Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిఆర్డిఓ అడిషనల్ పీడీ శిరీష
నవతెలంగాణ- బోనకల్
పల్లె ప్రగతి పనులను యుద్ధ ప్రాతిపదికమీద పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకు రావాలని డిఆర్డిఓ అడిషనల్ పిడి దేవరపల్లి శిరీష మండల అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. మండల పరిధిలోని లక్ష్మీపురం, గోవిందాపురం ఎల్ , రావినూతల గ్రామాలలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆకస్మిక పర్యటనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో గల పల్లె ప్రకృతి వనాలను, వైకుంఠధామాలను, నర్సరీలను ఆమె పరిశీలించారు. లక్ష్మీపురం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తూ చాలా బ్రహ్మాండంగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మిని అభినందించారు. పల్లె ప్రకృతివనంలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రత్యేకంగా మండల అధికారులతో కలిసి ఫోటోలు దిగారు. 7వ విడత హరితహారంలో భాగంగా ఆయా గ్రామాలలో మొక్కలు కూడా నాటారు. పల్లె ప్రగతి లో చేపట్టిన పనుల వివరాలను ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతిలో జరుగుతున్న పనులన్నింటినీ పరిశీలించారు.కార్యక్రమంలో ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, ఎంపీఓ కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు నన్నక లక్ష్మి, ఉమ్మనేని బాబు, కొమ్మినేని ఉపేందర్, పంచాయతీ కార్యదర్శులు భానోత్ శివుడు, కామిశెట్టి నరసింహారావు, జొన్నలగడ్డ అశోక్ కుమార్, లక్ష్మీపురంలో సిపిఎం సీనియర్ నాయకులు తిలారు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.