Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్లాట్ బుక్ కాక వెనుతిరిగి వెళ్లిన పలువురు దివ్యాంగులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం సెర్ప్ కార్యాలయంలో శుక్రవారం చర్ల, దుమ్ముగూడెం మండలాలకు చెందిన దివ్యాంగుల కోసం నిర్వహించిన సదరం క్యాంపుకు 32 మంది దివ్యాంగులు మాత్రమే హాజరయ్యారు. దివ్యాంగుల ధృవీకరణ పత్రాల కోసం ముందుగా సెర్ప్ అధికారులు స్లాట్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా దుమ్ముగూడెం, చర్ల మండలాల నుండి మొత్తం 53 మంది దివ్యాంగులు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ పత్రాల పరిశీలన కోసం 32 మంది మాత్రమే హాజరు అయినట్టు సెర్ప్ అధికారులు తెలుపుతున్నారు. కాగా చాలా మంది తాము వారం పది రోజుల నుండి స్లాట్ బుకింగ్ కోసం మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లినప్పటికీ స్లాట్ బుక్ కాలేదని నవతెలంగాణ ముందు వాపోయారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల నుండి వచ్చిన చాలా మంది దివ్యాంగులు నిరాశతో వెను తిరిగి పోయారు. కాగా అధికారులు మాత్రం స్లాట్ బుకింగ్‌కు లిమిట్ ఉందని దాని వలన సైట్ ఓపెన్ కాలేదని తెలపడంతో పాటు అగష్టు నెలలో మరలా సరదం క్యాంపు పెడతామని తెలిపారు. సదరం క్యాంపులో ఎంపీపీ రేసు లకీë, ఎంపీడీఓ ఎం.చంద్రమౌళి, మండల సమాఖ్య అధ్యక్షురాలు అనసూర్య, ఆర్దోపెడిక్ వైద్యాధికారి దేవరాజ్, వైద్యులు వెంకన్న, టి.ప్రవీణ్, ఎన్ వేణు, కె.విజయలతో పాటు ఫిజియోధెరపిస్టు వెంకటేశ్వర్లు, ఐఆఆర్పీలు, సెర్ప్ సిబ్బంది పాల్గొన్నారు.