Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని ఇందిరి నగర్ గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని ఏరియాలలో కొత్తవి మరి కొన్ని ఏరియాలలో విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించే కొత్తవి ఏర్పాటు చేస్తున్నా రు. డ్రైనేజీ పూడికలు, హరితహారంలో భాగంగా స్థానికులకు మొక్కల పంపిణీ, మిషన్ భగీరథ పైప్ లైన్ నిర్మాణాలు, రోడ్లపై గుంతల పూడికలు తదితర కార్యక్రమాలను చేపడుతు న్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ పాయం లలిత ,ఎంపీటీసీ మండల రాము మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
భద్రాచలం : భద్రాచలంలోని దసరా మండపంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ బి.శివాజీ శుక్రవారం మొక్కలు నాటారు. పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం ఆయన ఈ మండపంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం వల్ల పచ్చదనం వెల్లివిరుస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు.