Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్ల కేంద్రంలో 24 గంటలు వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక అంబేద్కర్ సెంటర్లో సుమారు గంట పాటు యువత రాస్తారోకో నిర్వహించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న సిమాంగ్ సెంటర్లో వైద్యులను నియమించాలని, సిబ్బందిని భర్తీ చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేస్తూ రాస్తారోకో కొనసాగించారు. వైద్యం అందని ద్రాక్ష అయిందని వెంటనే ఉన్నతాధికారులు స్పందించి మండలానికి పట్టిన గ్రహనాన్ని విడిపించాలని ప్రతి ఒక్కరికీ, మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలవాల బాలు, మామిడి శ్యామ్, కిషోర్, సాయి, వంటకాయల మహేష్, ప్రసాద్, బి సంపత్, విధాత, యాలంశ్రీను, రెడ్డి తదితరులు ఉన్నారు.