Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలకవర్గం సహకరంతో అభివృద్ధి చేస్తూ ప్రశంసలందుకుంటున్న సర్పంచ్ దోడ్డపనేని జ్యోతి
నవతెలంగాణ-కొణిజర్ల
గతకొద్ది నెలల క్రితం జిల్లా మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆకస్మికంగా మండల పరిధిలోని సింగరాయపాలెం గ్రామం సందర్శించి నర్సరీని పరిశీలించి.. గ్రామాభి వృద్ధిని చూసి శభాష్ సర్పంచ్ అంటూ కితాబిచ్చారు. వెంటనే పక్కన ఉన్న అధికారులను సింగరాయ పాలెం నర్సరీని జిల్లాలో ఉన్న సర్పంచ్‌లు, కార్యదర్శులు సందర్శించి ఈవిధంగా ప్రతిగ్రామంలో నర్సరీ ఉండేలా చూడాలని ఆదేశించారు. అలాగే గ్రామాభివృద్ధికి సంబంధించిన ఫోటోలను సాక్షాత్తు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ గతరెండు రోజుల క్రితం తన ట్విట్టర్లో ప్రకృతివనం, గ్రామానికి ఇరువైపులా నాటిన మొక్కలు, డంపింగ్ యార్డు, శ్మశానవాటిక ఫోటోలను పోస్ట్ చేయడంతో మరోసారి సింగరాయపాలెం గ్రామాభివృద్ధిపై జిల్లా వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. గ్రామాభివృద్ధి చూసి కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్‌పై సర్పంచ్ దోడ్డపనేని జ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆమె నవతెలంగాణతో మాట్లాడుతూ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎస్.రామకృష్ణ్ణ సహకరంతో గ్రామాభివృద్ధి చేస్తున్నానన్నారు. పారిశుద్య కార్మికుల చేత ఎప్పటికప్పుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. ప్రధానంగా ఊరిముందు చెరువు ఉంది. ఆ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేయాలని ఉందని, ప్రభుత్వం సూమారు పదిహేను లక్షలరూపాయలు నిధులు మంజూరు చేస్తే గ్రామాన్ని మినీ కోనసీమలా తీర్చిదిద్దవచ్చున్నారు.