Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట కాలువల మర్మత్తులు చేయాలి
- ఎంఎల్ఏ రాములు నాయక్‌కు రైతుల వినతి
నవతెలంగాణ-వైరా టౌన్
వైరా రిజర్వాయర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వాలని, పంట కాలువలు మర్మత్తులు చేసి చివరి భూములకు సాగునీరు అందించేందుకు కృషి చేయాలని శుక్రవారం వైరా మండలం లింగన్నపాలెం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు సకాలంలో సరఫరా కావడం లేదని, అనేక సంవత్సరాలుగా రైతులు పంట కాలువలను స్వంత ఖర్చులతో మర్మత్తులు చేసుకుంటున్నారని అన్నారు. రైతులు ఇబ్బందులనూ దృష్టిలో ఉంచుకుని కాలువలు మర్మత్తులను వెంటనే చేపట్టాలని , పెండింగులో ఉన్న జపాన్ నిధులను విడుదల చేయించి వైరా రిజర్వాయర్ ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని, వానాకాలం సీజనలో వరి పంట సాగు చేయుటకు సకాలంలో వరి నారును పెంచుకునే అవకాశం రైతులకు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ త్వరలో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి సాగు నీరు విడుదలపై నిర్ణయం చేస్తామని, ఆధునికీకరణ పనులుహ విషయం రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పూర్తి చేయుటకు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, సిపిఐ(ఎం) వైరా మండల కార్యదర్శి తోట నాగేశ్వరావు, లింగన్నపాలెం మాజీ సర్పంచ్ తోటకూర రామారావు, గరికపాడు సోసైటి డైరెక్టర్ బానాల కష్ణమాచారి, మండల పరిషత్ కోఆప్షన్ మాజీ సభ్యులు ఎస్.కె జానీమియా, లక్ష్మయ్య, బాబురావు, రైతులు పాల్గొన్నారు