Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకని మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన (హారితహారం) కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజరు కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ట్రైనీ కలెక్టర్ రాహుల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, మేయర్ పునుకొల్లు నీరజ, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, సుడా చైర్మన్ విజయకుమార్, స్ధానిక కార్పొరేటర్ గజ్జల లక్ష్మి, కమర్తపు మురళీ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేలా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని ప్రజల సహకారంతో యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తునట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్, హౌంగార్డు సిబ్బంది రెండు వేల పండ్ల, ఇతర మొక్కలను పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎల్.సి నాయక్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, అడిషనల్ డీసీపీ ప్రసాద్, అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏఎస్పీ స్నేహ మెహ్రా, ఏసీపీలు రమేష్, అంజనేయులు, వెంకటరెడ్డి , ప్రసన్న కుమార్, సబ్ జైల్ సూపరిండెంట్ శ్రీధర్, డిఆర్వీ లక్ష్మిపతి, హార్డికల్చర్ సందీప్, ఏవో అక్తరూనీసాబేగం, విధ్యుత్ శాఖ ఎస్ఈ రమేష్ , ఆర్ఐ లు రవి, శ్రీనివాస్, సాంబశివరావు, తిరుపతి, శ్రీశైలం, సిఐలు తుమ్మ గోపి, అంజలి, సురేష్, చిట్టిబాబు, శ్రీధర్, కరుణకర్, వెంకన్నబాబు, సత్యనారాయణరెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.