Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బోనకల్
మండల ప్రాథమిక వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్ కు ఉత్తమ వైద్యాధికారి అవార్డు ను జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి మాలతి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. 2019-2020 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శానిటేషన్, పచ్చదనం, పరిశుభ్రత, హాస్పటల్లో నాణ్యమైన వైద్య సేవలు అమలు చేయడంలో జిల్లాలో మొదటి స్థానం పొందారు. దీంతో కాయకల్ప ఉత్తమ అవార్డు కింద మండల వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్నను ఎంపిక చేశారు. 2019 -20 సంవత్సరం లో కరోనా వ్యాధి తీవ్రరూపం లో ఉన్నందున ఆనాడు ఉత్తమ వైద్యాధికారి అవార్డును అందజేయ లేకపోయారు. ప్రస్తుతం కరోనా వ్యాధి తగ్గటంతో కలెక్టర్ కార్యాలయంలో తాటికొండ శ్రీకాంత్ కి రెండవ మండల వైద్యాధికారి నంద్యాల బాలకష్ణకు కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీకాంత్ మాట్లాడుతూ తనతో పాటు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉత్తమ అవార్డు రావట లో ఎంతో కషి ఉందన్నారు. ఉత్తమ అవార్డు రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. వైద్య సిబ్బంది సహకారంతో ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కషి చేస్తామని తెలిపారు. ఆయన వెంట సి హెచ్ వో పెద్దినేని శ్రీనివాస రావు సూపర్వైజర్లు మందా దానయ్య టీ స్వర్ణ మార్తమ్మ స్టాఫ్ నర్స్ భవాని ఫార్మా సిస్టర్ రాధా లత ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.