Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ- రఘునాధపాలెం
మండల పరిధిలోని విఎం, బంజారా గ్రామపంచాయతీలో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్, మాలోతు లాలు, విజయ, అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ...తెలంగాణ రాష్ట్రంలో 8 వేల గ్రామ పంచాయతీలు ఉండగా గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం 12 వేల గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు. అనంతరం హరితహారం లో భాగంగా రోడ్డు ఇరువైపులా మొక్కలు లేని చోట మొక్కలు నాటి పెంచుకోవాలని గ్రామ సర్పంచ్ ని ఆయన ఆదేశించారు. వివిధ సంక్షేమ పథకాలతో పాటు నిరంతరాయంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా, రైతుబంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి గర్భిణీలకు కెసిఆర్ కిట్టు వితంతువులకు వికలాంగులకు ప్రభుత్వం ద్వారా పింఛన్లు ఇస్తున్నామన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మాట్లాడుతూ... వర్షాకాలం కానందున గ్రామ ప్రజలు ముఖ్యంగా పరిశుభ్రత చాలా అవసరమని, అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వైస్ చైర్మన్ పిన్ని కోటేశ్వరరావు, జడ్పిటిసి మాలోతు ప్రియాంక, ఎంపీపీ భూక్య గౌరీ, వైస్ ఎంపీపీ గుత్త రవి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు, మధం శెట్టి హరిప్రసాద్ పాల్గొన్నారు.