Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రోడ్డుపై బస్తీ వాసుల బైఠాయింపు
నవతెలంగాణ-ఇల్లందు
జేకే ఓసీలో గురువారం బ్లాస్టింగ్ నిర్వహించారు. బ్లాస్టింగ్ దాటికి పట్టణంలోని కళామందిర్ ఏరియాలో ఒక ఇంటిపై కప్పు రేకు పగిలి ఇంట్లో ఉన్న ఒక మహిళకు గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనలతో బయటికి పరుగులు తీశారు. ఉలిక్కిపడ్డ బస్తి వాసులంతా రోడ్డుమీదికి వచ్చారు. సమాచారం అందుకున్న సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ, మండల కార్యదర్శి తాలూరు కృష్ణ, నాయకులు వజ్జా సురేష్ తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. గాయాలతో నా బాధితురాలిని పరామర్శించారు. అనంతరం బ్లాస్టింగ్‌ను నిరసిస్తూ బైపాస్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం సంఘటనా స్థలానికి ఏజెంట్ బొల్లం వెంకటేశ్వర్లు, ఎస్టేట్, సెక్యూరిటీ అధికారులు వచ్చారు. స్థానికు లంతా అధికారులను చుట్టుముట్టారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ బాంబ్ బ్లాస్టింగ్‌తో ఇండ్లు పోతున్నాయని ఇంటి పై కప్పు రేకు పగిలి ఇంట్లో రాళ్లు పడి దెబ్బలు తగులుతున్నాయి భయభ్రాంతులకు గురవుతు న్నామని అధికారులను నిలదీశారు. ఇంకా ఎంత కాలం ఈ ఇబ్బందులకు గురి చేస్తారని వారికి నష్టపరిహారం ఇవ్వాలని, బ్లాస్టింగ్ శబ్దాలు తగ్గించాలని అబ్దుల్ నబీ, మండల కార్యదర్శి తా లూరు కృష్ణ, నాయకులు వజ్జా సురేష్ అధికారుల దృ ష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం అధికార పార్టీ నేతలు కౌన్సిలర్లు వచ్చి బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.