Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మోకాళ్లపై గిరిజనుల అభ్యర్ధన
నవతెలంగాణ-చర్ల
తమ పోడు భూములు తమకు ఇప్పించాలని జోల పట్టి, దండం పెట్టి, కలెక్టర్‌కు గిరిజనులు తమ గోడును వెళ్లబుచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు గత పది రోజులుగా గిరిజనుల భూమి గిరిజనులకు ఇవ్వాలంటూ సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కొండా చరణ్ మాట్లాడారు. గత పది రోజులుగా సర్వే నెంబర్ 53లోని 16 ఎకరాల పట్టాలు ఉన్న గిరిజనుల భూమి వారికే కావాలంటూ తహసీల్దార్‌కి మొర పెట్టుకుంటూ సమ్మె చేయడం జరుగుతుందన్నారు. సర్వే నిర్వహించి మీ భూమి మీకు ఇప్పిస్తామన్న రెవెన్యూ అధికారులు గురువారం సర్వే నిర్వహించినట్టు ఆ సర్వే ఫలితాలని కలెక్టర్‌కు పంపించామని తెలిపారన్నారు. ఆ సర్వేకి సంబం ధించిన ప్రతులను మాకు ఇవ్వడం జరిగిందన్నారు. అందులో 53 సర్వే నెంబర్ లేదని, చర్లలోని రైస్ పేట చెక్కులో కేవలం 49 సర్వే నెంబర్ వరకే ఉందంటూ అట్టి భూమికి మీకు ఎటువంటి సంబం ధం లేదని ఈ సమాచారాన్ని కలెక్టర్‌కు ఇచ్చామం టూ ఏమైనా ఉంటే కలెక్టర్‌తో మాట్లాడండి అని అధికారులు చెప్తున్నారన్నారు. గత 15 సంవత్సరాల క్రితం నాటి ప్రభుత్వం ఇదే భూమికి నాటి కలెక్టర్, ఐటీడీఏ పీవో, ఎమ్మెల్యే, తహసీల్దార్ చేతుల మీదగా 53 సర్వే నెంబర్‌తో ఇరవై ఎనిమిది మంది గిరిజన మహిళలకి 16 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింద న్నారు. ఇప్పుడు సర్వేనెంబర్ లేదు, భూమి లేదు, ఆ భూమికి మీకు ఎటువంటి సంబంధం లేదని అనడం దుర్మార్గం అన్నాడు.
చర్ల రెవెన్యూ వారు చెప్పిన విధంగా గిరిజనులకు తప్పుడు సర్వే నెంబర్లు వేసి భూమి లేకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 16 ఎకరాలకి హక్కుదారులుగా ఉన్న 28 మంది గిరిజనులకు వారి భూమిని వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల కార్యదర్శి మచ్చ రామారావు, వ్యకాస మండల అధ్యక్షుడు శ్యామల వెంకట్, మండల సహాయ కార్యదర్శి బందెల చంటి, సీపీఐ(ఎం) విజయకాలని శాఖ కార్యదర్శి వరదల వరలక్ష్మి, సూరమ్మ, నాగమణి, వీరబాబు, షారోని, వీరమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.