Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం గ్రామాలను, పట్టణాలను పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నట్లు ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. శుక్రవారం మండలం లోని లింగన్న పాలెం గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ కొఱ్ఱకొప్పు అనిత అధికారులతో కలిసి గ్రామంలో పారిశుధ్య పనులను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. పల్లె ప్రగతి వనాన్ని ఆయన ప్రారంభించారు. అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా స్పందించిన ఎమ్మెల్యే గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం గ్రామస్తులకు తడి, పొడి చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మండల ప్రత్యేకాధికారి కస్థాల సత్యనారాయణ, ఎంపిడిఓ ఎన్ వెంకట పతి రాజు, జడ్పి కో ఆప్షన్ సభ్యులు షేక్ లాల్ అహమ్మద్, ఎంపీటీసీ బూరుగు సంజీవరావు, గరికపాడు సొసైటీ చైర్మన్ అయిలూరి కృష్ణారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పసుపులేటి మోహనరావు, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జునరావు, మచ్చా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.