Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలు మెచ్చా, రేగా, సండ్ర
నవతెలంగాణ-అశ్వారావుపేట
అడవులు ఎంత అభివృద్ధి చెందితే వర్షపాతం అంతే సమృద్ధిగా ఉంటుందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ అడవులతోనే పూర్వం ఏ కాలం తగ్గట్టు ఆ కాలం వాతావరణం ఉండేదని, సమాజాభివృద్ధి వేగం పుంజుకోవడం ప్రకృతికి విఘాతం కలుగుతుందని అన్నారు. వాతావరణంలో సమతుల్యత రావాలంటే అడవులు విస్త్రృతంగా పెరగాలని తెలిపారు.
అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరిత హారంలో పాల్గొని మొక్కలు నాటారు. దమ్మపేట రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 65 ఎకరాల్లో నూతనంగా అటవీ అభివృద్ధి చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ అటవీ మండలాధికారి తిరుములరావు, రేంజర్ సామినేని శ్రీనివాస్, డిప్యూటీ రేంజర్ లాయక్ హుస్సేన్, ఎంపీపీ శ్రీరామమూర్తి, జడ్పీటీసీ వరలక్ష్మి, పుల్లారావులు పాల్గొన్నారు.
అదేవిధంగా మండలంలోని పేరాయిగూడెం పంచాయతీలో శానిటేషన్-ప్లాంటేషన్ పనితీరు ఎండో విద్యాధర రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమతి, కార్యదర్శి శ్రీరాంమూర్తి, పాలకవర్గం సిబ్బంది పాల్గొన్నారు.
మణుగూరు : మండలంలోని తిర్లాపురం గ్రామపంచాయతీలో 7వ విడత హరితహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొని ప్రారంభించారు. శుక్రవారం పిఏసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ కలలు కన్న గ్రీన్ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, మండల స్పెషల్ అధికారి రమాదేవి, ఎంపీడీవో వీరాబాబు, ఎంపీవో వెంకటేశ్వర్లు, నాయకులు ముత్యంబాబు, అడపా అప్పారావు యాదగిరిగౌడ్, ఎన్.రాజు,సాగర్ యాదవ్, హర్షవర్ధన్, రుద్ర వెంకట్, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
తల్లాడ : పల్లె ప్రకృతి వనంతో గ్రామాలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని రామానుజవరం గ్రామంలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రకృతి వనాన్ని, వైకుంఠధామంలో జరుగుతున్న పనులను, పరిశీలించి సర్పంచ్ శీలం కోటిరెడ్డి, ఎంపీటీసీ శివ పార్వతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి, తహసీల్దార్ గంటా శ్రీలత, ఆర్వి ఆర్ మోహన్ రెడ్డి, ఏటీఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని నారాయణపురం ఎస్సీ కాలనీలో గురువారం రాత్రి గ్రామపంచాయతీ సీతారాముల పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గుర్తించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.