Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ ఆర్ఎల్సీ కార్యాలయం ముందు జాతీయ కార్మిక సంఘాల ధర్నా
- ఆర్ఎల్సీకి వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని హైదరాబాద్ ఆర్ఎల్సీ కార్యాలయం ముందు బొగ్గు గని జాతీయ కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ఎల్సీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు 2017 అక్టోబర్ 5న నిర్వహించడం జరిగిందని తెలిపారు. రీజనల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సీ) రెండు సంవత్సరాల కాలపరిమితితో టీబీజీకేఎస్ సంఘానికి గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. గుర్తింపు సంఘం కాల పరిమితి ముగిసి రెండు సంవత్సరాలు గడిచినా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎన్నికలు నిర్వహించకపోతే కార్మికుల సమస్యలు పరిష్కరించడం కోసం అన్ని కార్మిక సంఘాలకు యజమాన్యంతో చర్చించేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐదు జాతీయ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏఐటియూసీ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, సీఐటియూ రాష్ట్ర నాయకులు మంద నరసింహ రావు, ఐఎన్టియూసీ రాష్ట్ర నాయకులు జనక్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు రియాజ్ అహ్మద్, బిఎంఎస్ రాష్ట్ర నాయకులు మాధవ్ నాయక్ పాల్గొన్నారు, సీఐటీయూ నుండి, మెండె శ్రీనివాస్, కే.రాజయ్య, విజయగిరి శ్రీనివాస్, కర్ల వీరస్వామి, ఎలగొండ శ్రీరాంమూర్తి , ఎస్ వెంకటస్వామి, విజరు కుమార్ రెడ్డి, ఆసరి మహేష్, సిహెచ్.వేణుగోపాల్ రెడ్డి, ఆరెపెళ్లి రాజమౌళి, నంది నారాయణ, అన్నం శ్రీనివాస్, ఎప్పలపెల్లి సతీష్, హైమద్ పాషా, తదితరులు పాల్గొన్నారు,
ఈ నెల 11న గురుకుల యుజి కామన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ టెస్ట్
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
ఈ నెల 11న తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ పరీక్షలను ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగానే పాల్వంచ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల లక్ష్మీదేవి పల్లిలో ఎగ్జామ్ సెంటర్ ఉన్నదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకొని, కరోనా నిబంధనలకు అనుగుణంగా పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.