Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనల మార్పులపై సర్పంచులలో అయోమయం
నవతెలంగాణ-బోనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రామ పంచాయతీలకు కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారమే పరిపాలన చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల నుంచి నీటి, ఇంటి పనులు ద్వారా వచ్చిన వివరాలు, ఇంకా రావలసిన వివరాలను నోటీసు బోర్డులో పొందుపరచాలి. ప్రతినెల వీధిలైట్లు తనిఖీ చేసి వీధిలైట్లు వేయాలి. ఎన్ని వేశారో నోటీస్ బోర్డులో చూపాలి. ప్రతి నెల కొత్త పింఛను ఎవరికి రావాలో వారికి ఇప్పించాలి. ప్రతి నెలలో ఒక సారి మరుగుదొడ్లను శుభ్రం చేసుకోవటం, చెత్తను చెత్త కుండీలో వేయడం లాంటి ప్రోగ్రామును చేపట్టాలి. ఏదైనా పండగలకు ఖర్చు పెడితే వాటి ఖర్చు వివరాలను కూడా నోటీస్ బోర్డులో పొందుపరచాలి. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, ఎంత ఖర్చు చేశారో నోటీసు బోర్డులో పొందుపరచాలి. ప్రతి నెల గ్రామం లో గ్రామసభ నిర్వహించాలి, గ్రామ సభకు వంద మందికి పైగా హాజరు కావాలి, సంబంధిత అధికారికి ఆ ఫోటోలను పంపించాలి. గ్రామ సభ ద్వారా గ్రామంలో ప్రజలకు ఏమి అవసరమో తెలుసుకొని వాటిని ఏర్పాటు చేయాలి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి, ఒకవేళ లేనియెడల వెంటనే మరుగుదొడ్డి కట్టించాలి. మరుగుదొడ్లు కట్టిన తర్వాత బిల్లులు రాక పోతే వాటిని లబ్ధిదారులకు ఇప్పించాలి. గ్రామంలో ప్రతి ఇంటి ఆవరణలో రెండు మొక్కలను నటించాలి. రేషన్ షాపులో బియ్యం ఎన్ని వస్తున్నాయి, ఎన్ని లబ్ధిదారులు తీసుకుపోతున్నారో పరిశీలించాలి. బయట సరుకులు రేషన్ షాపులో లో అమ్మ రాదు. ప్రతి మనిషికి ప్రభుత్వం 132 రూపాయలు చొప్పున గ్రామ పంచాయతీకి నిధులు విడుదల చేస్తుంది. ఈ విధంగా గ్రామ పంచాయతీకి ఎంత వస్తున్నాయి, గ్రామ సభలో ప్రజలు అడగవచ్చు ,ఈ డబ్బులు దేనికి ఉపయోగించారని సభలో ప్రజలు అడగాలి. ఈ 11 అంశాలలో ఏదైనా లోపం జరిగినా, పదవి నుంచి తొలగించే అధికారం ప్రజలకు ఉంది. ఇటువంటి విషయాలు చోటు చేసుకున్నప్పుడు ఈ విషయాన్ని వెంటనే పైఅధికారికి ఫిర్యాదు చేయండి. ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు, మిగిలింది ఎంత అనే విషయాలపై గ్రామ ప్రజలకు వివరించాలి. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అడగాలి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన నిబంధనలు విడుదల చేసి గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పంచాయతీ సర్పంచ్ అయోమయం నెలకొని ఉంది.