Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం ఉరిసికాయలపల్లిలోని శ్రీకోటమైసమ్మ అమ్మ వారి ఆలయంలో ఆదివారం అషాఢమాస బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ డాక్టర్పర్సా పట్టాభి రామారావు-డాక్టర్ విజయలక్ష్మి దంపతులు ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాధ మాస భోనాలతో ఆలయం సందడిగా మారింది. ఆలయ ప్రధాన అర్చకులు కొత్తలంక కైలాసశర్మ, సాయిశర్మ పూజ కార్యక్రమాలు నిర్వహించగా ఆలయం ఇంచార్జీ మోహన్చౌహన్ ఏర్పాట్లను పరిశీలించారు.
భాగ్యనగర్తండాలో...
భాగ్యనగర్తండాలో సర్పంచ్ ఇస్లావత్ సుజాతబన్సీలాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢ మాస బోనమెత్తారు. ఊరేగింపుగా గ్రామదేవతలకు అభిషేకాలు నిర్వహించి బోనాలను సమర్పించారు.