Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, పువ్వాడ అజరు కుమార్
నవతెలంగాణ-కల్లూరు
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.35 కోట్లు మంజురు చేసినట్లు రాష్ట్రపంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం కల్లూరు మండల పరిధిలోని బత్తలపల్లి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి, రైతు వేదికలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక భనవంలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ బత్తలపల్లి అభివృద్ధికి బత్తులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శిలం సత్యనారాయణ రెడ్డి అభ్యర్థన మేరకు అభివృద్ధికి 20 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. రైతు పట్ల ఆలోచన చేసి రైతు అభివృద్ధికి నిలయంగా రైతు బిడ్డగా కేసీఆర్ సూచనలు అభినందించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ మండలంలో పల్లె ప్రకృతి వనాలు ఎంతో అహళ్లదకరంగా పెంతున్నారని తెలిపారు. హరితహారంలో ఆత్యధికంగా మొక్కలు నాటి జిల్లాలోనే ప్రథమంగా నిలవాలని కోరారు. ఎంపీ నామ మాట్లాడుతూ కేసిఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమలు వివరించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, జెడ్పీ చైర్మెన్ లింగాల కమల్‌రాజ్, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషణం, ఎంపీపీ బీరవల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజరు కుమార్, సర్పంచ్ శిలం సత్యనారాయణ రెడ్డి, రైతు సమితి జిల్లా సభ్యులు, మండల కన్వీనర్ పసుమర్తి చంద్రరావు, లక్కీనేని రఘు, సొసైటీ అధ్యక్షులు బోబోలు లక్ష్మణరావు పాల్గొన్నారు.
అడవిమల్లెలలో ఘనంగా ప్రకృతి వనం రైతు వేదిక ప్రారంభోత్సవం
పెనుబల్లి : పెనుబల్లి మండలంలోని అడవిమల్లెల గ్రామంలో ఆదివారం ఘనంగా ప్రకృతి వనం, రైతు వేదిక ప్రారంభోత్సవాలు జరిగాయి. ప్రకృతి వనంలో ఏర్పాటుచేసిన మహాత్మా గాంధీ, అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలను మంత్రులు పువ్వాడ అజరు కుమార్, ఎర్రబెల్లి దయాకర్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆవిష్కరించారు. గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంపై మంత్రులు సర్పంచ్‌ని ప్రశంసించారు. అనంతరం రైతు వేదిక ప్రాంగణంలో గ్రామ సర్పంచి మందడపు అశోక్ కుమార్ అధ్యక్షతన సభ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన అనేక కార్యక్రమాలు బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పిటిసి చక్కిలాల మోహన్ రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, అధికారులు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.