Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాథ్
- బీవీకే ఆధ్వర్యంలో ఐసోలేషన్ సెంటర్ ఆత్మీయ సమ్మేళనం
- ఐసోలేషన్ సెంటర్ నిర్వహణపై అభినందనల వెల్లువ.
నవతెలంగాణ-ఖమ్మం
సైన్స్‌ను ప్రోత్సహిచాల్సిన పాలకులే సైన్స్ వ్యతిరేక విధానం అవలంభించడం సరైంది కాదని ప్రముఖ వైద్యులు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాధ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావులు అన్నారు. ఆదివారం మంచికంటి భవన్ లో బివికే జనరల్ మేనేజర్ వై. శ్రీనివాసరావు అధ్యక్షతన ఐసోలేషన్ సెంటర్ ఆశ్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కోవిడ్‌ను అదుపులోకి తెచ్చేందుకు అనేకమంది వైద్య సిబ్బంది తీవ్రమైన కృషి చేస్తున్నారని వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక వైపు కరోనాను ఎదుర్కొనే దాంట్లో వైద్యులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు తీవ్రమైన కృషి చేస్తుంటే, మరోవైపు బాబాలు, సన్యాసులు సైన్సును వైద్య సేవలు అందిస్తున్న వారిని అవమానించే పద్ధతిలో మాట్లాడుతున్నారని, పాలకులు కూడా వారిని కంట్రోల్ చేయడం లేదని విమర్శించారు. బీవీకే ఆధ్వర్యంలో జరిగిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ సేవలను పలువురు వక్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి, పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ బాధ్యులు వై వెంకటేశ్వరావు, ఎస్ఆర్ ఫౌండేషన్ బాధ్యులు బండి నాగేశ్వరరావు, జోనాల రామకృష్ణ, చేతన ఫౌండేషన్ బాధ్యులు పసుమర్తి . సత్యసాయి సేవా సమితి బాధ్యులు సుధాకర్, యుటిఎఫ్ బాధ్యులు ఎం సురేష్, రంజాన్, జన విజ్ఞాన వేదిక నాయకులు ఎల్వి రెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కళ్యాణం నాగేశ్వరరావు, డాక్టర్ బత్తినేని వెంకటేశ్వరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బుగ్గవిటీ సరళ, భూక్య వీరభద్రం పాల్గొన్నారు.