Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విష్యత్ పోరాటాలకు దిశానిర్దేశం చేయనున్న మహాసభలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు
నవతెలంగాణ-గాంధీచౌక్
దేశంలో, రాష్ట్రంలో మెజారిటీ ప్రజల ప్రయోజనాలే ఎజెండాగా సీపీఐ(ఎం) పోరాటాలు నిర్వహిస్తోందని కానీ నేడు మిగతా పార్టీలు ప్రజా సమస్యలు పక్కన పెట్టి అధికారమే పరమావధిగా రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక సిపిఎం త్రీటౌన్ కార్యాలయంలో వజినేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన త్రీటౌన్ కమిటీ మరియు శాఖా కార్యదర్శులు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నున్నా మాట్లాడుతూ రెండు సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే హడావిడి ప్రారంభించిన వ్యక్తి గత ఆరోపణలు, మాటల వేడితో మొత్తం మీడియాని దేశంలో, రాష్ట్రంలో వ్యక్తుల చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. ఈ ముసుగులో ప్రజా సమస్యలు మరుగున పరిచారుస్తున్నారని యధేచ్ఛగా ప్రజా ఆస్తులను తెగనమ్ముతున్నారని పేర్కొన్నారు. ప్రజా ఆలోచనలను విద్వేషాలవైపు మరల్చుతున్నారని, ప్రశ్నించే వారిపై నిరంకుశంగా నిర్బంధాలు ప్రయోగిస్తున్నా రని విమర్శించారు. కానీ ఈ పరిస్థితి ఎల్లకాలం కొనసాగించలేరని ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి తాత్కాలికంగా గడ్డుకాలం ఎదుర్కొన్న అంతిమ విజయం ప్రజా పోరాటాలదేనని పిలుపు నిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీ మహాసభలో దేశ, రాష్ట్ర ప్రజా సమస్యల పరిష్కారం కై భవిష్యత్ లో నిర్వహించబోయే పోరాటాల రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటి సభ్యులు యర్రా శ్రీ నివాసరావు, త్రీటౌన్ కార్యదర్శి తుశాకుల లింగయ్య, నాయకులు బండారు యాకయ్య, కార్పోరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, టౌన్ నాయకులు యస్ కె సైదులు, భూక్య శ్రీనివాసరావు, బజ్జూరి రమణారెడ్డి, యస్ కె బాబు, పత్తిపాక నాగసులోచన, మద్ది సత్యం, యస్ కె హిమామ్, శీలం వీరబాబు, మేకల శ్రీ నివాసరావు, వేల్పుల నాగేశ్వర రావు, పాశం సత్యనారాయణ, శాఖా కార్యదర్శులు పాల్గొన్నారు.