Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా సీపీఐ(ఎం) నాయకన్‌గూడెం శాఖ మహాసభ
నవతెలంగాణ-కూసుమంచి
మండల పరిధిలోని నాయకన్ గూడెం గ్రామంలో ఇండ్ల స్థలాలు, ఇండ్లు లేని వారికి గ్రామాల్లోని ఎన్ఎస్పీ స్థలాలలో ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వాలని, అలా కాకుండా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుపేదలను ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేస్తామని మండల కార్యదర్శి బారి మల్సూర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో సింగం నాగేశ్వరరావు సభా ప్రాంగణంలో ఆ గ్రామ పదమూడవ శాఖ మహాసభ జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వమే గ్రామంలో నిరుపేదలను గుర్తించి వారికి ప్రభుత్వమే స్థలాలు అందే విధంగా చూడాలన్నారు.
గ్రామ కార్యదర్శి కర్ణబాబు ఏకగ్రీవ ఎన్నిక
సీపీఐ(ఎం) గ్రామ మహాసభ లో ఆ పార్టీ శాఖ సభ్యులు ఏకగ్రీవంగా ఉల్లోజు కర్ణబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మేకల అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల జగన్మోహన్ రెడ్డి, గడ్డం మురళి, ఎస్.కె ఖాసిం, ఉల్లోజు పురుషోత్తం, సింగం సోమయ్య, ఉల్లోజు వేణు, కృష్ణంరాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.