Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టీయు,ఐయన్టియుసి
నవతెలంగాణ-ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వా నికి పిఆర్పీ కమిటీ సిఫార్సు చేసిన వేతనాలు అమలు చేయాలని మున్సిపల్ కార్మికుల ను నాలుగో తరగతి ఉద్యోగులు గా గుర్తించాలని సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు, ఐయన్టియుసి మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు డిమాం డ్ చేశారు. ఆదివారం స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్ కార్మికుల ముఖ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో (సిఐటియు) జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్, మున్సిపల్ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసీ) ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టియు) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. రామయ్య, (ఐయన్టియుసి) ఖమ్మం నగర కార్యదర్శి సి.హెచ్.విప్లవకుమార్లు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో పారిశుద్ధ్యం, గార్డెన్, వాటర్ సప్లరు, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, జవాన్లు, కంప్యూటర్ ఆఫ్ రేటర్లు, డ్రైవర్లగా పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపుదల పే కమీషన్ అనేక మందితో చర్చించి అనేక విషయాలు పరిగణలోకి తీసుకొని తన సిఫార్సులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సిఐటియు మున్సిపల్ యూనియన్ ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు దొడ్డా నర్సింహారావు, బి ప్రసాద్, ఐఎఫ్టియు డివిజన్ కార్యదర్శి ఆడెపు రామారావు, ఎఐటియుసీ మున్సిపల్ నగర నాయకులు షేక్ హుస్సేన్, బి. పాపారావు, ఐయన్టియుసి మున్సిపల్ కార్మిక సంఘం నగర అధ్యక్షులు యం. జయరాజు తదితరులు పాల్గొన్నారు.