Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియాలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. శనివారం నుండి కురుస్తున్న వర్షంతో ఓపెన్ కాస్టు గనుల్లో వర్షపు నీరు చేరి బొగ్గు ఉత్తత్తికి అంతరాయం కలిగింది. కొత్తగూడెం ఏరియా పరిధిలోని సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్కాస్టుల నుండి రోజులకు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాలి, కొత్తగూడెం గౌతంఖని ఓపెన్ కాస్టు నుండి 8 వేల టన్నుల బొగ్గు ఉత్పతికత కావాలి ఉంది. వాన కారణంగా విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కారణంగా20 వేల టన్నులకు అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తుంది. ఆదివారం సెలవు కావడంతో బొగ్గు ఉత్పత్తి కాలేదు.సోమవారం ఉదయం షిఫ్ట్వారు ఉపరితల గనిలో నిలిచిన వర్గం నీరును భారీ మోటార్ల ద్వారా వాటిని తోడివేస్తారు. అనంతరం బొగ్గు ఉత్పత్తి చేస్తారు. వర్షం ఇలాగే కొనసాగితే విధులకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తుంది.