Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అశ్వాపురం
మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి కుమారుడు జగదీశ్వరరెడ్డి ఇటీవల మృతి చెందాడు. దీంతో ఆదివారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన స్వగృహానికి చేరుకుని మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని ఓదార్చి సానుభూతిని వ్యక్తంచేసారు. నివాళులర్పించినవారిలో ఎమ్మెల్యే, విప్ రేగా కాంతారావు, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, తుళ్ళూరి బ్రహ్మయ్య, పోశం నర్సింహరావు, సర్పంచ్ మర్రి మల్లారెడ్డి, ఎంపీటీసీ కమటం నరేష్, కోడి అమరెందర్, వేములపల్లి రమేష్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
పినపాక : కరోనా మరణాలను చూస్తే చాలా బాధ వేస్తుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలో మాజీ బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ నాయకులు కోలేటి భవాని శంకర్‌ను పరామర్శించారు. భవాని శంకర్ కుమారుడు రవి కుమార్ మరణించిన విషయం తెలుసుకొని ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రవి కుమార్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, జడ్పీటీసీ సుభద్రాదేవి వాసుబాబు, వెంకటరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.