Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
గ్రామ ప్రజలకు ఇబ్బందిగా మారిన 40 ఏళ్ల క్రితం పాత బావికి పల్లె ప్రగతి లో మోక్షం లభించింది. మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సర్పంచ్ నోముల వెంకట నరసమ్మ వివరించారు. రోజువారీ కార్యక్రమాలలో భాగంగా ఆదివారం గ్రామంలో వ్యాధులు ప్రబలకుండా దోమల మందులు స్ప్రే చేయించారు. పల్లె ప్రగతి పదిరోజులు కార్యక్రమంలో గ్రామంలో ఉన్న సైడ్ కాలువలలో మురుగు నీరు నిలువకుండా శుభ్రం చేయించారు. అదేవిధంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. రోడ్డు వెంట మొక్కల నాటారు. నాలుగో వార్డ్‌లో దళిత కాలనీలో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన పాత బావి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఆర్థిక పరమైన సమస్య అయినప్పటికీ ఆ పాత బావిని పూడ్చించినట్లు సర్పంచి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఉప సర్పంచ్ తుళ్లూరు కొండల్ రావు, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తాళ్లూరు గోపి గ్రామపంచాయతీ మల్టీపర్పస్ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.