Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడపిల్లని పుట్టకుండాచేస్తే కఠిన చర్యలు
- డీఎంఅండ్‌హెచ్‌ఓ శిరీష
నవతెలంగాణ-కొత్తగూడెం
దేశాభివృద్ధికి జనాభా నియంత్రణ చాలా అవసరమని, గర్భంలో ఆడపిల్లని గుర్తించి పుట్టకుండా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జేవిఎల్.శిరీష అన్నారు. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా డీఎంఅం డ్హెచ్ఓ కార్యాలయంలో జిల్లాలో కుటుంబ నియం త్రణకు తోడ్పడిన సిబ్బంది, ప్రోగ్రాం అధికారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడారు. ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా వలన అన్ని రకాల వనరులకు ఇబ్బందుల పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కుటంబ నియంత్రణ దేశ ప్రగతికి సోఫానమన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందిందిచిన వైద్యులు డాక్టర్ ఎన్.బేబీరాణి, ఉత్తమ స్టాఫ్ నర్సు పి.వేదమణి, ఉత్తమ సూపర్వైజర్ ఇస్తార్రాణి, ఉత్తమ ఏఎన్ఎం టి.రమణ, ఉత్తమ ఆశ శిరోమణిలను సర్టిఫికేట్, నగదు బహుమతులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ సర్ డాక్టర్ పోటు వినోద్‌కుమార్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వి.స్వాతి, డెమో ఫైజ్మెయినుద్దిన్, విజరుకుమార్, ఇనాక్, ఫరీద్, చార్లీస్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : ఏరియా జీఎం కార్యాలయంలో ఆదివారం భారత్ కా అమృత్ మహౌత్సవ్ కార్యక్రమంలో భాగం గా గనులు, విభాగాలతో పాటు జీఎం కార్యాల యం లో ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహి ంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏరియా జీఎం మల్లెల సుబ్బారావు పాల్గొని, మాట్లా డారు. జ నాభా సమస్యల ఆవశ్యకత, ప్రాముఖ్యత పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ప్రతి సంవత్సరం జూలై 11ను ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహి స్తున్నామ న్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వోటు జీఎం బండి వెం కటయ్య, ఏజీఎం జి.ప్రభాకరరావు, డీజీఎం పర్సనల్ జీవి.మోహన్ రావు, కోయగూడెం ఓసీ పీఓ మల్లయ్య, మేనేజర్ జీవన్ కుమార్ ఉద్యోగులు పాల్గొన్నారు.