Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ నగర్లో భారీగా నిలిచిన వర్షపునీరు
- మూసుకుపోయిన డ్రైనేజీ తూరలు
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-అశ్వాపురం
ఈ నెల ఒకటో తేదీ నుండి 10 వరకు ప్రభుత్వం అట్టహాసంగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వర్షాకాల సీజన్లో ప్రతీ పల్లె పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు ఆదేశాలను జారిచేసింది. ప్రతీ పంచాయతీకి సరిపడా నిధులను సమకూర్చినప్పటికీ కొన్ని ప్రాంతాలు అభివృద్ధి పనులకు నోచుకోకుండా పోతున్నాయి. మండలంలోని అమెర్ద పంచాయతీలోగల అంబెద్కర్ నగర్ గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తోంది. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఓ పక్కన పెద్ద ఎత్తున వర్షపు నీరు నిల్వ ఉంది. నీళ్ళు వెళ్ళెందుకు అవకాశం లేక ఎక్కడి నీళ్ళు అక్కడే నిల్వఉన్నాయి.
పల్లె ప్రగతిలో పూడిక తీయని కాలువలు :
పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టినన్ని రోజులు ఈ గ్రామంలోని ఒక్క కాలువలో పూడికలు తీసిన జాడలు లేవు. గత వర్షకాలంలో పేరుకుపోయిన మట్టి రోడ్డుకు అడ్డంగా వేసిన తూరలు పూర్తిగా పూడిపోవడంతో వర్షపు నీరు బైటకు వెళ్ళెపరిస్థితి లేకుండాపోయింది. అంతే కాకుండా నీళ్ళు వెళ్ళె కాలువలను పూడ్చడంకూడా నీళ్ళు నిలిచేందుకు ఓ కారణమైంది.
డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేయాలంటున్న గ్రామస్తులు :
అంబేద్కర్ నగర్ గ్రామంలో నెలకొని ఉన్న డ్రైనేజీ వ్యస్థను శుభ్రంచేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా మండల పంచాయతీ అధికారులు చొరవతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో మురుగునీరు నిల్వ ఉండటం వలన దోమలు వృద్ది చేందుతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్లకు అడ్డంగా వేసిన తూరులలో పేరుకుపోయిన మట్టిని తొలగించడంతోపాటు తూరలు లేని చోట కొత్త తూరలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఈ నెల 17న పాలీసెట్ ప్రవేశ పరీక్ష : కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
ఈ నెల 17వ తేదీన (శనివారం) నిర్వహించనున్న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ పరీక్ష నిర్వహణకు కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారన్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు కొత్తగూడెం నందు ఏర్పాటు చేసిన 9 కేంద్రాల్లో 2248, భద్రాచలం నందు ఏర్పాటు చేసిన 5 కేంద్రాల్లో 881 మంది మొత్తం 3129 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు చెప్పారు. 17వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులను ఉదయం 10 గంటల నుండి పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారని 11 గంటల తరువాత ఒక నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరని తెలిపారు. పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని చెప్పారు. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నందున ఆయా రూట్లులో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు.