Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొగ్గు గని కార్మికులకు ముగిసిన పదోవ వేతన సవరణ కాలం
నవతెలంగాణ-మణుగూరు
బొగ్గు గని కార్మికుల పదోవ వేతన సవరణ కాలం జూన్ 30తో ముగిసింది. 2016 జూలై 1వ తేదీ నుండి పదోవ వేతన సవరణ కాల పరిమితి మొదలైంది. పదోవ వేతన ఒప్పందం 2017 అక్టోబర్ 10వ తేదీన కుదిరింది. జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు కోలిండియా, సింగరేణి యాజమాన్యాల నడుమ వేతన సవరణపై పలు విడుతల్లో జరిగిన చర్చల అనంతరం ఒక అవగాహణకు వచ్చారు. 9వ వేతన సవరణ ఒప్పందంపై 20శాతం పెంచుతు ఒప్పందం చేసుకున్నారు. పదోవ వేతన సవరణ ఒప్పందం ముగియనుండగా జాతీయ సంఘాలు తమ డిమాండ్లను సిద్ధం చేసుకున్నాయి. అన్నీ సవ్యంగా వుంటే బొగ్గు గని కార్మికులకు సంబంధించి జూలై నెలలో 11వ తేదన సవరణ కమిటీ మొదటి దపా సమావేశం జరిగే అవకాశం వుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో పాటు కోలిండియా యాజమాన్యం ఆధ్వర్యంలో 5 జాతీయ కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్ల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. వేతనాల పెరుగుదలతో పాటు ఇతర ఆర్ధిక అంశాలకు సంబంధించిన ప్రయోజనాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. బొగ్గు గని కార్మికుల సవరణ ఒప్పందాలు ప్రతి సారీ ఆలుస్య మౌతూనే వున్నాయి. ఒకటి నుండి పదోవ సవరణ ఒప్పందం వరకు ఏండ్ల తరబడి వేతనాల పెరుగుదల కోసం ఏదురుచూడాల్సిన పరిస్థితి వుండేది. బొగ్గు గని కార్మికులకు 1975 నుంచి వేతన ఒప్పందాలు అమలవు న్నాయి. అంతకుముందు యాజమాన్యాల ఇష్టం మేరకు చెల్లించేవారు. దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికులందకీ ఒకే విధంగా వేతనాలు వుండాలని జాతీయ కార్మిక సంఘాలు యాజమాన్యాలపై ఒత్తిడి తేవడంతోనే వేతన సవరణ సాధ్యమైంది. మొదటి మూడు ఒప్పం దాలు మూడేళ్ల కాల పరిమితితో నిర్ణయించారు. ఆ తరువాత నాగేళ్లు ఐదోవ వేతనం నుండి ఐదేళ్ల ఒక్కసారి వేతన ఒప్పందాలు చేసుకోవాలని అంగీకారం కుదుర్చుకున్నారు. యాజమాన్యాలు మాత్రం పదేళ్లకు ఒక్కసారి చేసుకోవాలని ప్రతిపాదన తీసుకోచ్చినా కార్మిక సంఘాలు అంగీకరించలేదు. దేశంలోనే వివిధ బొగ్గు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వేతన ఒప్పందాలు అమలవతాయి. కోలిండియా పరిధిలో వున్న 8 కంపెనీలతో పాటు సింగరేణి, టిస్కో, ఇస్కో కంపెనీలలో పనిచేసే గని కార్మికులకు వేతన సవరణ ఒప్పందాలు వర్తిస్తాయి. ఇండియాలో 3.3 ఐదు లక్షల మంది, సింగరేణిలో 45వేల మంది కార్మికులతో పాటు టిస్కో, ఇస్కో మరో ఐదు వేల మందికి ఉద్యోగాలకు సవరణ వర్తిస్తుంది. జూన్ 30తో ముగిసిన పదొవ వేతన ఒప్పందం కాలం పూర్తి అయింది. జూలై 30తో 2026 జూలై 26 వరకు 11వ తేదీన ఒప్పందం అమలవతుంది. ఖానీ 1975 నుండి 1978 వరకు మొదటి వేతన సవరణ ఒప్పందం 20 రోజులు ఆలస్యంగా మొదలైంది. రెండొవ వేతన ఒప్పందం 8 నెలలు, మూడో వేతన ఒప్పందం 11 నెలలు, నాల్గొవ వేతన ఒప్పందం 31 నెలలు, ఐదు వేతన ఒప్పందం 54 నెలలు, ఆరొవ వేతన ఒప్పందం 53 నెలలు, ఏడొవ వేతన ఒప్పందం 48 నెలలు, ఎనిమిదొవ వేతన ఒప్పందం 30 నెలలు, తొమ్మిదొ వేతన ఒప్పందం 7 నెలలు, పదొవ వేతన ఒప్పందం 16 నెలలు జాప్యం జరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలసత్వం కారణంగా కార్మికులు నష్టపోయ్యారు. పదొవ వేతన ఒప్పదం ముగిసి పది రోజులు గడుస్తున్న కార్మిక సంఘాలు ప్రశ్నించిన ఇంత వరకు స్పందించకపోవడం కార్మికుల్లో ఆందోళన నెలకొన్నది. వెంటనే 11వేతన ఒప్పందం అమలు చేయాలని ఇప్పుడు వున్న వేతనం కన్నా 50శాతం వేతనం పెంచాలని కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.