Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రాలో కలిసిన రాజుపేటను భద్రాచలంలో కలపాలి
- సీపీఐ(ఎం) రాజుపేట శాఖ మహా సభల్లో తీర్మానం
నవతెలంగాణ-భద్రాచలం
దేశంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో బీజేపీ పాలన నడుస్తోందని, బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పిలుపునిచ్చారు. పార్టీ రాజుపేట శాఖ మహాసభ డి.రామకృష్ణ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేసి తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు కుట్ర చేస్తోందని అన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకు రావడం ద్వారా ప్రజల హక్కులను కాలరాస్తోందని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నిత్యవసర వస్తువులు రోజురోజుకీ విపరీతంగా పెంచుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని అన్నారు. ఈ మహాసభలో పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.బి.నర్సారెడ్డిలు ప్రసం గించారు. కాగా శాఖ మహాసభ ప్రారంభానికి ముం దు పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ సభ్యులు కామ్రే డ్ సజ్జా రామచంద్ర రావు ఆవిష్కరించారు. ఈ మహాసభలో పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండా రు శరత్ బాబు, పట్టణ కమిటీ సభ్యులు నాదెళ్ళ లీలావతి, యం.వి.ప్రసాదరావు, పార్టీ సభ్యులు డేగల రాంబాబు, పిల్లెం లక్ష్మీకాంత, నిట్ట వరలక్ష్మి, యేసు, శీలం సాయి, డి.వినీల్ తదితరులు పాల్గొన్నారు.