Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-మణుగూరు
గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతమ్మ ప్రాజెక్ట్ ప్రభావిత భూ నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక శ్రామికభవనంలో బొల్లంరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గోదావరి నదిపై నిర్మిస్తున్న సీత్తమ్మ ప్రాజెక్ట్ వలన రెండు పంటలు పండే భూములు కోల్పోయి నిర్వాసితులవుతున్న రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ ప్రాజెక్ట్ వలన మణుగూరు, అశ్వాపురం, చర్ల, దుమ్మగూడెం మండలాల రైతులు సర్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి భూములకు ఎకరానికి రూ.25లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మిగిలి వున్న వ్యవసాయ భూములకు సాగునీటి వసతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమవేశంలో మణుగూ రు, కరకగూడెం మండల కార్యద ర్శులు కాటిబోయిన నాగేశ్వరరావు, సత్రపల్లి సాంబశివరావు, నెల్లూరి నాగేశ్వరరావు, మడి నర్సింహారావు, ముల్కల ఉత్తమ్, పల్లి చంద్రయ్య, పద్మ, రంగయ్య, నర్సింహారావు, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.