Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారి ఎస్ వి కే నారాయణరావు
నవతెలంగాణ-నేలకొండపల్లి
పత్తిలో సరైన యాజమాన్య పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి కె నారాయణరావు అన్నారు. సోమవారం మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలో గ్రామ రైతు కన్వీనర్ పొలంపల్లి ఉపేందర్, రైతు వీరవల్లి వేణు పత్తి పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 3500 ఎకరాల్లో రైతులు పత్తిపంట సాగు చేసినట్లు తెలిపారు. నేలకొండపల్లి మండలంలో రైతులు పత్తి పంట సాగు చేసి 30 రోజులు గడిచింది అన్నారు. ఈ తరుణంలో పైపాటు ఎరువులుగా 25 కేజీల నత్రజని, పది కేజీల ఫొటాస్లను నాలుగు సమాన భాగాలుగా విభజించి మొక్కల మొదళ్లకు 7 నుండి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు చేసి వేసుకోవాలి అన్నారు. ప్రత్తి మొక్కలు మొలకెత్తిన నెల రోజులకు వచ్చే లేతగడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు క్విజ్లోపాస్ ఇథైల్ 400 మిల్లీ లీటర్లు లేదా ప్రోపాక్విజా పాస్ 250 మిల్లీలీటర్ల మరియు ఫైరీతియ్యో బ్యాక్ సోడియం 250 మిల్లీ లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో పచ్చ దోమ ఉదృతి ఎక్కువగా కనిపిస్తుందన్నారు. పచ్చ దోమ వంటి రసం పీల్చే పురుగు నివారణకు విచ్చలవిడిగా రసాయనిక పురుగు మందులను పిచికారి చేయకుండా కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలన్నారు. 30 నుండి 45 రోజుల వ్యవధిలో మోనోక్రోటోఫాస్ మరియు నీరు1:4 నిష్పత్తిలో కలుపుకొని కాండంపై బొట్టు పెట్టు విధానంలో మందు పూసినట్లయితే రసం పీల్చే పురుగుల ఉధతిని సమర్ధవంతంగా నివారించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉదరు కిరణ్, రైతులు పాల్గొన్నారు.