Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
కేంద్ర ఆరోగ్య వైద్య బృందం ఎన్కాస్ ఎసెస్స్ మెంట్ పథకం కింద బోనకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నాణ్యత ప్రమాణాలు, పరిశీలనపై ఆన్లైన్ జూమ్ ద్వారా సోమవారం పరిశీలించారు. కేంద్ర బృందంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఆర్.సఖిల, రాగిణి అస్సాం రాష్ట్రానికి చెందిన రోహిణి కుమార్ ఉన్నారు. ఈ కేంద్ర వైద్య బృందం ఆన్లైన్ జూమ్ ద్వారా మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పలు అంశాలను పరిశీలించారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డులను, పీహెచ్సీ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని వారు జూమ్ ద్వారా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి మాలతి, మండల ప్రాథమిక వైద్యాధికారి తాటికొండ శ్రీకాంత్, రెండవ వైద్యాధికారి నంద్యాల బాలకృష్ణ, స్టాఫ్ నర్స్ కోడి రెక్కల భవాని, ల్యాబ్ టెక్నీషియన్ యాకోబు, ఫార్మా సిస్టర్ రాధాలత, ఏఎన్ఎంలు శ్రీలక్ష్మి, సరోజ, సరస్వతితో పాటు ఆశా కార్యకర్త విజయను వారు ఆన్లైన్ జూమ్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు. కేంద్ర బృందం అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారు. కరోనా బాధితులకు అందించిన వైద్యం వివరాలను కూడా వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేస్తూ మండల వైద్య బృందాన్ని అభినందించారు. కోవిడ్ పరిస్థితులు చక్కపడితే మూడు నెలలలో స్వయంగా పరిశీలించేందుకు కూడా వైద్య బందం రానున్నట్లు మండల వైద్యాధికారి తెలిపారు. కేంద్ర వైద్య బందానికి సంధానకర్తగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ మేనేజర్ ఉపేందర్ జిల్లా కోఆర్డినేటర్ నీలోహన, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వైద్య బృందం సభ్యులు శ్రీకాంత్, శిరీష, డీపీఎం ఓ బద్రు, ఎస్టీఎస్ సందీప్, సిహెచ్ఓ పెద్దినేని శ్రీనివాస రావు సూపర్వైజర్లు మంద దానయ్య, టి స్వర్ణమార్తమ్మ, వివిధ గ్రామాల ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.