Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచాలి
- సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం
వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కాంట్రాక్ట్ ఉద్యోగులకు పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచి, రెగ్యులర్ చేయాలని, ఆశ్రమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న హెల్త్ కోఆర్డినేటర్లకు కూడా 510 జీవోను వర్తింపజేసి పీఆర్సి చేయాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, అధ్యక్షులు ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తొలి పిఆర్సిలో జీఓ 60 ద్వారా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచిందని, కానీ వైద్య ఆరోగ్య శాఖలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచలేదన్నారు. వీరందరూ గత 15 నుండి 22 సంవత్సరాలుగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత 17 నెలలుగా కరోనా మహమ్మారితో సహవాసం చేస్తూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వేతనాలు పెంచి, రెగ్యులర్ చేయాలని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్‌లోని రెండవ ఏఎన్ఎంలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోని ఏఎన్ఎంలు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, స్టాప్‌లు, మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మాసిస్టు, అకౌంటెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, స్వీపర్స్, వాచ్ మెన్స్ఇతర సిబ్బంది వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగాలలోని ఉద్యోగులు, ఆయుష్, యన్టిఈపి, టీసాక్స్, ఆర్బిఎస్కె, యన్సిడి, ఆరోగ్యశ్రీ, బ్లడ్ బ్యాంక్స్, సిమాంక్, ఎస్ఆర్ సి, ఎస్ఎన్ సియు, డైక్ ఇతర అన్ని స్కీంలలోని ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేస్తున్నారన్నారు. ఈఓలు, ప్రోగ్రాం అధికారులు, హెమోర్డ్ ఏఎన్ఎంలు, డ్రైవర్లు, కంటింజెన్సీ ఉద్యోగులు, నేచురోపతి, ఐపియంలోని ఉద్యోగులు ఇతర విభాగాలలోని ఉద్యోగులు అందరూ మెరిట్ ప్రతిపదికన రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రోష్టర్ ప్రాతిపదికన నియామకమైన గత 15 నుండి 22 సంవతరాలుగా పనిచేస్తూ ఏజ్ లిమిట్ దాటిపోయి ఉన్నారని. వీరందరినీ యదావిధిగా రెగ్యులర్ చెయ్యాలని డిమాండ్ చేశారు.ధర్నాకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీకాంత్, ఎం.గోపాల్, పి.రమ్య, యూనియన్ నాయకులు కిరణ్, రంగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.