Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజిల్, పెట్రోల్ ధరల పెంపు పట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
- ఎడ్లబండితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రదర్శన
నవతెలంగాణ-ఖమ్మం
కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకాన్ని నడ్డి విరిసేలా, డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు పెంచిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సంజీవరెడ్డి భవనం నుండి ధర్నా చౌక్ వరకు మోడీ ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా సిఎల్పి లీడర్ భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో యడ్ల బండిపై ప్రదర్శన, సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ధరలు పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. డీజిల్, పెట్రోల్ రేట్లు ఇలాగే పెరిగితే సామాన్య ప్రజానీకం యడ్ల బండ్లు, సైకిల్లపై తిరగాల్సి వస్తుందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎంఎల్సీ పోట్ల నాగేశ్వరరావు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి, కళ్లెం వెంకటరెడ్డి, మామిడి వెంకన్న, దొబ్బల సౌజన్య, చంద్రిక, బొడ్డు బొందయ్య, కందుల గురునాదం, మధిర, ఖమ్మం, పాలేరు, వైరా నియోజకవర్గ వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.