Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
నవతెలంగాణ- చర్ల
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం చర్ల ఐసిడిఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంగన్ వాడీ ఉద్యోగుల సమస్యలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఒకరోజు ఆలిండియా డిమాండ్స్ డేను నిర్వహించాలని ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఫెడరేషన్ నిర్ణయం చేసింది. ఈ పిలుపుతో తెలంగాణ అంగన్ వాడీ వర్కర్స్ (టీచర్స్ ) అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు ) భాగస్వామ్యం అవుతుందని సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే బ్రహ్మచారి, సిఐటియు మండల కన్వీనర్ పాయం రాధాకుమారిలు తెలియజేసారు.
-అంగన్వాడీల డిమాండ్లు
1. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి , ఐసిడిఎసను బలోపేతం చేయాలి.
2. అంగన్ వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
3. కనీస వేతనం, పెన్షన్, ఈఎన్ఎ, ఉద్యోగ భద్రత కల్పించాలి.
4. 2018 అక్టోబర్ నుండి కేంద్రం పెంచిన వేతనాలు చెల్లించాలి
5. 2017 నుండి పెండింగ్ ఏడీఏలు ఇతర బిల్లులు వెంటనే చెల్లించాలి, 11వ పిఆరిసి ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సవరించాలి. అంగన్వాడీ ఉద్యోగులకు చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీచేయాలి.
7. 11వ పిఆర్సి కమిటీ సూచన ప్రకారం కనీస వేతనం రూ . 19,000లు నిర్ణయించాలి.
8. ఈలోపు జీఓ నెం.60 ప్రకారం టీచర్లకు రూ . 19,500లు, హెల్పర్లు , మినీ వర్కర్లకు రూ . 15,600 / -లు కనీస వేతనం చెల్లించాలి.
9.మినీ అంగన్ వాడీ వర్కర్లను, మెయిన్ టీచర్లుగా గుర్తించాలి. ఈ కేంద్రాలలో హెల్పర్లను నియమించాలి.
10. ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో ఐసిడిఎస్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాలో, ప్రాజెక్టు కమిటీ అధ్యక్షురాలు కమల మనోహరి, నాయకురాళ్ళు స్వరూప, కృష్ణవేణి, సత్యవతి, భారతి, ఈశ్వరి, భానుమతి తదితరులు పాల్గొన్నారు.