Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు
నవతెలంగాణ-సత్తుపల్లి రూరల్
సత్తుపల్లి మండలం కాకర్లపల్లి సొసైటీ పరిధిలో రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి గ్రామాలకు చెందిన 12మంది అన్నదాతల కష్టం దళారుల పాలు అయిందని సీపీఎం మండల కార్యదర్శి జాజిరి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కాకర్లపల్లి గ్రామంలో బాధిత రైతులతో జాజిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేస్తామని ప్రగల్బాలు పలికిందన్నారు. కానీ ఎంతోమంది రైతులు రోజులు తరబడి కలల్లో ధాన్యం ఆరబోసుకోని రాత్రి పగలు ఎన్నో ఇక్కట్లు పడ్డారని ఆయన అన్నారు. మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లుగా, కాకర్లపల్లి సొసైటీ పరిధిలోని సొసైటీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కూడా కొంతమంది రైతులు ఆర్థికంగాను, మానసికంగాను ఎంతో నష్ట పోయారని వారిమాటల్ని బట్టి అర్థమౌతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాకర్లపల్లి సొసైటీ నుండి చివరగా రెండు లారీల ధాన్యం కరీంనగర్ మిల్లర్లకు తరలించారు. ఆ మిల్లర్లు ధాన్యం బాగోలేదన్న పేరుతో క్వింటాకు 15 కిలోలు అదనపు తరుగు తీశారు. సహకార సిబ్బంది, ప్రభుత్వం, మిల్లర్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు నష్ట పోయారన్నారు. కొనుగోలు ఆలస్యం చేయడం వలన ధాన్యం యార్డులో నెలల తరబడి ఉంచడం కారణంగానే వర్షాలకు తడిసి పోవడం తో రైతులు తరుగు పేరుమీద నష్ట పోయారన్నారు.
12 మంది రైతుల తరుగు ధాన్యం విలువ రూ.3,21,294 అన్నారు. ఈ రైతుల నష్టాన్ని సంబంధిత అధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకోని మిల్లర్ల నుండి మొత్తం పైసలు ఇప్పించాలని జాజిరి డిమ్యాండ్ చేశారు. బాధిత రైతులకు సీపీఎం అడగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, రైతు సంఘం నాయుకులు కొలికపోగు సర్వేశ్వరావు, వేపులపాటి కుమారస్వామి, బాధిత రైతులు ఈదర చంటి, బలగాన్ని రాధాకృ, షేక్ ఖాసీం, పమ్మి శ్రీహరి, గాదె వెంకట రామిరెడ్డి, సారా రవి, ఈదర వసంతరావు, కంచర్ల వెంకటేశ్వరరావు, సీతారామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.