Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.50 లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-కొత్తగూడెం
పట్టణాభివృద్ధితో ప్రజలు ఎదుర్కోంటున్న కష్టాలు పోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం కొత్తగూడెం మున్సిపాలిటీ 12వ వార్డ్‌లో ఎస్సీబినగర్లో వరద నీటితో ముంపుకు గురయ్యే ప్రాంతానికి రూ.50 లక్షల వ్యయంతో సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం రాష్ట్ర్టంలోనే నెంబర్ వన్‌గా ఉండాలన్నది నా ఆకాంక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, కౌన్సిలర్లు కూరపాటి విజయలక్ష్మి, కోలాపూరి ధర్మరాజు, పరమేష్ యాదవ్, బండి నరసింహ, బాల శెట్టి సత్యభామ, వనచర్ల విమల, మోరే రూప, గుమ్మడవెల్లి కళ్యాణి, సాహారా బేగం, జయంతి మసూద్, అజ్మీర సుజాత, కో-ఆప్షన్ సభ్యులు దుంపల అనురాధ, వనమా రాఘవేంద్ర రావు, తదితరులు పాల్గొన్నారు.