Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోరు వానను సైతం లెక్కచేయని ట్రస్ట్ నిర్వాహకులు
- తలకొరివి పెట్టిన కూతురు
నవతెలంగాణ-భద్రాచలం
రక్త సంబంధీకులయిన పెదనాన్న, బాబారు, పిల్లలు రాలేమని తేల్చి చెప్పడంతో గత్యంతరం లేక కరోనాతో చనిపోయిన తల్లి చితికి చిన్న కూతురు శశికళ నిప్పంటించి తలకొరివి పెట్టిన సంఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి... భద్రాచలం డివిజన్లోని పినపాక మండలం బయ్యారంకు చెందిన కణితి రత్తమ్మ (55) భర్త బుజ్జయ్య మూడేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు శశిరేఖ (33), శశికళ (22) ఉన్నారు. శశికళ ఇంటర్ చదవగా, శశి రేఖ డిగ్రీ చదివారు. దాదాపు 12 రోజులుగా కరోనాతో భాధపడుతున్న తల్లి రత్తమ్మకి దగ్గర ఉండి వైద్య సేవలు ఇద్దరు పిల్లలు అందించారు. పెద్ద కూతురు, ఆమె భర్త, పిల్లలకు కూడా కరోనా సోకింది. వారు కూడా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పటల్లోనే చికిత్స పొందుతున్నారు. తల్లి ఆరోగ్య పరిస్థితి చేయి దాటిపోవడంతో భద్రాచలంలో ప్రభుత్వ హాస్పటల్లో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయారు. హాస్పటల్ నుండి స్మశాన వాటికకి తీసుకువెళ్ళే బంధువులు లేకపోవడంతో, బండారు చంద్రరావు ట్రస్ట్‌ని సంప్రదించి, అంత్యక్రియలు చేయమని కోరారు.వెంటనే స్పందించిన బీసీఆర్ ట్రస్ట్ నిర్వాహకులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె.రమేష్, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామిలు జోరున వర్షం కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వ హాస్పటల్‌కి వెళ్లి అంబులెన్స్ సహాయంతో వైకుంఠదామానికి మృత దేహాన్ని తీసుకువెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు.న