Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో ముందస్తు జాగ్రత్తతో సత్యనారాయణపురం ప్రాథమిక వైద్యశాల పరిధిలోగల కిష్టారం పాడు ఆదివాసీ గ్రామానికి వైద్య బృందం వాగులు దాటుకొని సోమవారం చేరుకుంది. డాక్టర్ మౌనిక నేతృత్వంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించడం, గర్భిణీలను పరీక్షించినట్టు ఆమె తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఎఎన్ఎమ్ వీరమ్మ, హెల్త్ అసిస్టెంట్ సుబ్బారావులు పాల్గొన్నట్లు ఆమె వివరించారు.
మణుగూరులో భారీ వర్షం.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సబ్ డివిజన్లో గత రెండు రోజులగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. బిటిపిఎస్ పనులకు ఆటంకం ఏర్పాడ్డాయి. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారి ఇరువైపుల డ్రైనేజి ఓపెన్‌గా వుండడంతో మురుగు రోడ్లపై ప్రవహించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కొన్నారు. 14 గ్రామపంచాయతీలో వర్షాల కారణంగా రోడ్లన్నీ బురదమయ్యాయి. మిషన్ భగిరథ పనులు వలన రోడ్లపై మట్టి వుండడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.
తప్పుల తడకగా సీతమ్మ సాగర్ భూ సర్వే
నవతెలంగాణ -దుమ్ముగూడెం
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసితుల భూ సర్వే తప్పుల తడకగా ఉన్నదని టిడిపి మండల అధ్యక్షులు కొమరం దామోదరరావు ఆరోపించారు. సోమవారం కరకట్ట నిర్మాణంతో నష్టపోతున్న రైతుల భూములు '' రీ''సర్వే జరపాలని కోరుతూ పెదబండిరేవు గ్రామానికి చెందిన నిర్వాసిత రైతులు తహసీల్దార్ వర్ష రవికుమార్‌కు వినతి పత్రం అందజేశారు. మెమోరాండంసమర్పించారు. ఈ కార్యక్రమంలో సోయం లక్షీనర్సు, పూనెం బాబూరావు, శ్యామల నరసింహరావు, పూనెం జగపతి, పూనెం లక్ష్మీదేవి, వెంకటమ్మ, మంగమ్మ, మల్లమ్మ, సత్తెమ్మ తదితరులు ఉన్నారు.