Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
- నష్టపోయిన రైతులకు తిరిగి పరిహారం చెల్లించాలి
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-కొత్తగూడెం
వరిధాన్యం, కొనుగోలులో జరిగిన కుంభకోణంపై న్యాయ విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకొని నష్టపోయిన రైతులకు తిరిగి పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆ సంఘం జిల్లా కార్యయలంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాసాని అయిలయ్య మాట్లడుతూ జిల్లాలో వరి ధాన్యం, కొనుగోలు సమయంలో మిల్లర్లు, దళారులు, అధికారులు ఒకటి అయి పంట పండించిన రైతు నుండి తరుగుల పేరుతో క్వింటాకు 10 కిలోలు చొప్పున దోపిడీ చేశారని తెలిపారు. ఫలితంగా కోట్ల రూపాయాలు కుంభకోణం జరిగిందని విమర్శించారు. ఈ కుంభకోణంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేసారు. ఈ సంవత్సరం రబీ సీజన్లో జిల్లాలో 78762 ఎకరాలలో వరి సాగుచేసిచేసినట్టు చెప్పారు. 80-90 వేల మేట్రిక్ టన్నులు ధాన్యం పండించాలని లక్ష్యం పెట్టుకున్నారని తెలిపారు. అట్లా పండిన వరికి జిల్లా వ్యాప్తంగా 150 కొనుగోలు కేంద్రాల్ని (సహాకార సంఘాలు 112, ఇకెపి-14, జిసిసి 17) ఏర్పాటు చేసినారని, ఇప్పటి వరకు కేటాయించిన కేంద్రాలలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రాష్ట్రంలో 23 మిల్లులకు కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారన్నారు. మన జిల్లాలో ఇల్లందు, లక్ష్మిపురం, ఒక్కటి చొప్పుమ వరంగల్, కరీంనగర్లో 21 మిల్లుల్ని కేటాయించారని, పంట పండి తర్వాత మిల్లర్లు దళారులు కుమ్మకై సకాలంలో లారీలు పెట్టకుండా అల్యాసం చేయడం వలన జిల్లాలో అకాల వర్షాలు రావటం వలన పంట తడిసి పోవటం, కొంత కొట్టుకు పోవటం వలన జరిగిందని తెలిపారు. దాంతో సుమారు 5-6 శాతం పంటను రైతులు నష్టపోయారని అన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు జిల్లాలో 9623 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించారని, ఇలా సేకరించిన ధాన్యంలో 10 శాతం అంటే 96.23 మెట్రిక్ డన్నుల ధాన్యాన్ని దళారులు, మిల్లర్ల యజమానులు, అధికారులు కుమ్మకై తరుగుల పేరుతో రైతుల నుండి బలవంతంగా వసూళ్ళు చేశారన్నారు. అంటే ఒక మెట్రిక్ టన్నుకి రూ.18,000లు ప్రభుత్వ మద్దతు ధరను నిర్ణయించింది. ఆ విధంగా చూసినప్పుడు 9623 క్వింటాలు, క్వింటాకు రూ.1800లు చొప్పున 9623 క్వింటాలను రూ.1,73,21,400 ఒక కోటి డెబ్బై లక్షల ఇరవై ఒక వెయ్యి నాలుగు వందలు అక్షరాల దళారులు బలవంతంగా రైతు నుండి దోపిడి చేశారని ఆరోపించారు. దీనికి తోడు దళారులు ఆలస్యం వలన అకాల వర్షాలకు 5 శాతం నష్టం వాటిల్లిందన్నారు. అది సుమారు రూ.8 లక్షలు కోత విధించి కాజేశారని దుయ్యబట్టారు.
ఈ రెండు కలిపితే సుమారు రెండు కోట్లు అరవై లక్షల (రూ.2.60లక్షలు) రైతులకు నష్టం వాటిల్లిందని రైతాంగాన్ని రకరకాల పేరుతో ధగా చేయడమే కాకుండా కోట్లు రూపాయలు దొడ్డి దారిన మల్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకొనుటకు తక్షణ విచారణ జరిపించి నష్టపోయిన రైతులకు అట్టి డబ్బులు ఇప్పించాల్సిందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యలమంచి రవికుమార్, కార్యదర్శి కున్సోత్ ధర్మ, సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారయణ, ఉపాధ్యక్షులు బానోత్ ధర్మ, జిల్లా నాయకులు దొడ్డి లక్ష్మి నారాయణ, బానోత్ కుమారి, వాంకుడోత్ కొబల్, సాంబశివరావు, సుర్యచంద్రరావు, రాంరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.