Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎఫ్ఓ మొండివైఖరి మార్చుకోవాలి
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-చర్ల
ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏకతాటిపైకి వచ్చి మండల కేంద్రంలో ప్రజా వైద్యాన్ని మెరుగు పరచాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం), కేవీపీఎస్, వ్యకాస ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని, ప్రసూతి వైద్య శాలలో వైద్య సిబ్బందిని నియమించాలని, పోస్టు మార్టం నిర్వహణ చర్ల కేంద్రంగానే జరగాలని చేస్తున్న దీక్షా శిబిరాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా మచ్చా మాట్లాడుతూ ముందుగా ఈ దీక్ష కొనసాగిస్తున్న దీక్ష రథసారథులు మచ్చా రామా రావు, ఊడుగుల షారోని, బందెల చంటి, శ్యామల వెంకటేష్‌లకు అభినందనలు తెలియజేశారు. అనం తరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో నివశిస్తున్నా ప్రజలకు చుట్టుపక్కల ఉన్న 13 పంచాయతీల వ్యాప్తంగా గల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదని తెలిసినా అధికారులు, ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. మండల కేంద్రంలో కమ్యూనిటీ హాల్ సెంటర్ నిర్వహించాలన్నారు.
పేరుకు మాత్రం ప్రసూతి వైద్యశాల నియమించి అందులో ఒక్క డాక్టర్, ఒక్క నర్సుని కూడా నియమించకుండా ఏ విధంగా వైద్యం నిర్వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందిని నియమించి ప్రసూతి ఆస్పత్రిలోవైద్యం నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్, మండల కమిటీ సభ్యులు కారం నరేష్, చింత్తూరి రజిని, కోటి ముత్యాలరావు, అలవాల రాజమ్మ, అసలు సతీష్, అమ్ముల సాంబశివరావు, వరలక్ష్మి, జగన్, రాజు తదితరులు పాల్గొన్నారు.