Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల కేంద్రంలో ఫొటో గ్రాఫర్లు ఎన్నిక ఏకీగ్రీవంగా జిల్లా అధ్యక్షులు మారుతి ప్రకాష్ సమక్షంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా ఆలూరి లక్ష్మణరావు, కార్యదర్శిగా ముద్రగడ్డ సురేష్, కోశాధికారిగా వాసు, జిల్లా కమిటీ సభ్యులుగా రవిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లక్ష్మణరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ఫోటో గ్రాఫర్లుకి పనులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఫోటో గ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లుకు వడ్డీ లేని రుణాలు రెండు లక్షలు ఇవ్వాలని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి రామకృష్ణ జిల్లా ఎన్నిక అధికారులు నరసింహారావు, షరీఫ్, అనిల్, మండల ఫోటో వీడియోగ్రాఫర్లు కృష్ణారెడ్డి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ములకలపల్లి ములకలపల్లి ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మంగళవారం ఎన్నిక జరిగింది. అసోసియేషన్ మండల అధ్యక్షులుగా పోడియం ప్రేమ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ సత్తిబాబు, కోశాధికారి సతీష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యవర్గం సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా మండలానికి చెందిన సీనియర్ ఫోటో గ్రాఫర్ పువ్వాల శ్రీనివాసరావు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మారుతి ప్రకాశరావు, తెలంగాణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల నరసింహారావు, జిల్లా కార్యవర్గం దమ్మపేట యూనిన్ ప్రెసిడెంట్ అశ్వారావుపేట యూనియన్ ప్రెసిడెంట్ పాల్గొన్నారు.