Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
విద్యార్థులకు ఈ నెల 1వ తేదీ నుండి మొదలైన ఆన్లైన్ తరగతులను ప్రధానోపాధ్యాయులు సక్రమంగా పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఇ.సోమశేఖర శర్మ ఆదేశించారు. మంగళవారం కొత్తగూడెంలోని బాబుక్యాంప్ ఉన్నత పాఠశాల, పాత కొత్తగూడెం ఉన్నత పాఠశాల, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, ఆనందఖనిలను జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజశేఖర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. బాబుక్యాంప్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలను సరిగా పర్యవేక్షించడం లేదని, డైరీ నిర్వహణ, పిల్లలకు సరియైన సమాచారం అందించడంలో నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతకొత్తగూడెం ఉన్నత పాఠశాల, ప్రాధమిక పాఠశాలలను సందర్శించిన ఆయన అక్కడి పిల్లల ఇళ్లకు వెళ్లి వారు ఆన్లైన్ పాఠాలను వింటున్న తీరును పరిశీలిచారు. ఈ సందర్భంగా డీఈఓ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పిల్లలకు ఆన్లైన్ తరగతులకు సంబంధించిన కాలనిర్ణయ పట్టికను ప్రతిరోజు తెలియజేయాలని, అలాగే ఉపాధ్యాయులవద్ద కూడా హార్డ్ కాపీ ఉంచుకోవాలని సూచించారు.