Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలువ రూ.40 లక్షలు
- ముగ్గురు అరెస్టు, వాహనం సీజ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలో అక్రమంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం భద్రాచలంలోని అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా ఓ వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న వారిని, వాహనంలో తనిఖీలు చేయగా గంజాయి లభ్య మైంది. గంజాయి 200 కేజీలు ఉంటుందని, దీని విలువ రూ.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ ఆదేశాల మేరకు భద్రాచలం సీఐ టి.స్వామి, పట్టణ ఎస్ఐ ఎస్ మధు ప్రసాద్‌ల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మారుతి స్విఫ్ట్ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, వారు అనుమా నాస్పదంగా ఉండటంతో వారిని, వారి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో నిషేధిత గంజాయి 200 కేజీలు లభ్యమైంది. దీని విలువ రూ.40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ఒస్మానాబాద్ జిల్లాకు చెందిన సమాధాన్, విక్రమ్, గణేష్‌లు ఒరిస్సాలోని పసుపు లంక ప్రాంతం నుంచి ఈ గంజాయిని మహా రాష్ట్రకు తరలిస్తున్నట్టు పోలీసులు విచారణలో తేలింది. అదేవిధంగా వాహనాలు సీజ్ చేశారు. ఈ గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ డాక్టర్ జి.వినీత్ మాట్లా డుతూ భద్రాచలంలో 24 గంటల పాటు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ టి.స్వామి, పట్టణ ఎస్ఐ మధు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.