Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 గేట్లు అడుగు మేర ఎత్తి 2,696 క్యూసెక్కులు
- గోదావరిలోకి విడుదల
నవతెలంగాణ-చర్ల
మండలంలో గల తాలిపేరు ప్రాజెక్టుకు వడి వడిగా నీరు చేరడంతో తాలిపేరుప్రాజెక్ట్కు వరద పోటెత్తింది. అప్రమత్తమైన అధికారు లు నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2800 క్యూసెక్కుల నీరు గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు సరాసరి లోతు 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం 73.14 మీటర్ల నీరు నిల్వచేస్తూ అదనపు సాగునీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నట్టు డీఈ తిరుపతి తెలుపుతున్నారు.
మండలంలో గల తాలిపేరు ప్రాజెక్టు నిండటంతో తాలిపేరు ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 25 వేల ఎకరాల్లో వానాకాలం ( ఖరీప్ ) పంట పండించే దిశగా రైతన్న సిద్ధం అయ్యారు. ఎగువ నుండి వస్తున్న నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అధిక నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదిలేస్తున్నారు. ప్రాజెక్టు వరద తాకిడి పెరిగితే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రాజెక్టు రిజర్వాయర్లోకి 2800 క్యూసెక్కుల నీరు చేరిన నేపథ్యంలో, ప్రాజెక్టు నిండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిండుకుండలా దర్శనమిస్తున్న తాలిపేరు ప్రాజెక్టు చెంతకు పర్యాటకులు వస్తున్నారు.