Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు కాసాని
నవతెలంగాణ-పాల్వంచ రూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీదారుల పక్షాన నిలబడుతూ ఉన్నాయని సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం పాల్వంచ అల్లూరు సెంటర్లో పార్టీ కార్యాలయంలో మండల కమిటీ సభ్యులు తంబళ్ళ శ్రీను అధ్యక్షతన జరిగిన పార్టీ మండల కమిటీ శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీలకు కట్టబెట్టి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారని ఆరోపించారు. కరోనాతో ప్రజలు మరణిస్తుంటే కనీసం పట్టించుకోని మోడీ ప్రభుత్వంపై పోరాటా లకు సిద్ధం కావాలన్నారు. పార్టీ శాఖ మహాసభల్లో నిర్ణయాలు తీసుకొని ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోడు భూముల పై నిరంకుశంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రైతుల పక్షాన పార్టీ అండగా నిలబడి పోడు భూములను వదులుకోబోమని అవసరమైతే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు నరేందర్, వెంకట్రావు, రాజులు, రాందాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.