Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసుల గోడు ఐటీడీఏ అధికారులకు పట్టదా..?
- 10 రోజులుగా నిరహార దీక్షలు చేస్తున్నా కలెక్టర్, సబ్ కలెక్టర్
స్పందించరా..?
- ఐటీడీఏ ఎదుట సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో విజయకాలనీ గిరిజనుల ధర్నా
నవతెలంగాణ-చర్ల/భద్రాచలం
చర్ల మండల రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకి విజయకాలనీ ఆదివాసులు నష్టపోలా? మాపట్ట భూముల ఎలా గుంజుకుంటారు. పట్టాలిచ్చే టప్పుడున్న2007 సంవత్సరంలో వున్న 53 సర్వేనెంబర్ 2021లో ఎలామయమైంది. ఎవరు మాయం చేశారో..రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కె.బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. ఆదివాసుల భూములు రెవిన్యూ అధికారులు గుంజుకుంటుంటే గిరిజనుల పక్షణా వుండవలసిన ఐటీడీఏ అధికారులు ఎందుకు స్పందించటంలేదని విమర్శించారు. జోరువర్షంలో తడుస్తూ పదిరోజులుగా చర్లలో నిరహార దీక్షలు చేస్తుంటే కలెక్టర్, సబ్ కలెక్టర్ ఎందుకు పట్టించుకోవటంలేదని ప్రశ్నించారు. 2000సంవత్సరం నుండి సాగులో వుండి ఎన్ఆర్ఈజీఎస్ పనులు కింద అభివృద్ధి కార్యక్ర మాలు చేశారన్నారు. ఆదివాసులకు అన్యాయం చేసి భూములనుండి వెళ్ళగొట్టి ఏకలవ్య పాఠశాలకు భూములు గుంజుకునే చర్యలను తక్షణం విరవ్నిం చుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల భూములకు తప్పుడు సర్వే నెంబర్లు వేసిన రెవెన్యూ అధికారులపై చ్యరలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీఏ అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుంజా శ్రీను, నాయకురాలు పి.సమ్మక్క, విజయకాలనీ గిరిజనులు వరలక్ష్మి, మురళి రాములమ్మ, గీత, సూరమ్మ, జయలక్ష్మి, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.