Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లెట్ విత్తనాలు పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
పోషక భద్రత కోసం చిరుధాన్యాల సాగుతో పాటు వినియోగాన్ని పెంచేందుకు చేపట్టిన మిల్లెట్ విత్తనాలు పంపిణీ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికలు అందయాలని కలెక్టర్ అనుదీప్ ఆధికారునుల ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళా శిశుసంక్షేమ, వైద్య, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్, ఎన్జీఓలతో మిల్లెట్స్ సాగుపై సమీక్షా సమావేశం నిర్వహించి మండలాల వారిగా విత్తనాలు పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీతి ఆయోగ్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ. జిల్లా యంత్రాంగం, వాసన్ సంస్ధ రిసోర్స్ సంస్థ ప్రాజెక్టు భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. జిల్లాలో టేకులపల్లి, అశ్వాపురం, అశ్వారావుపేట మండలాల్లో మిల్లెట్ పంట సాగుకు 1962 మంది రైతులను ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరంలో ఈ మూడు మండలాల్లో పాజెక్టు కింద 1528 ఎకరాల్లో మిల్లెట్ సాగుచేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సీజన్లో 15 వందల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఎంపిక చేయబడిన మండలాల్లో పంట సాగు పర్యవేక్షణకు ప్రత్యేకంగా సీఆర్సీలను నియమించినట్టు ఆయన తెలిపారు. మిల్లెట్ విత్తనాలు తీసుకున్న రైతులు సేద్యం చేస్తున్నారా లేదా క్షేత్రస్థాయిలో పటిష్ట పర్యవేక్షణ జరగాలని చెప్పారు. పిల్లలకు, గర్భిణీలు, బాలింతలు పోషకాహార లోపం వల్ల వ్యాధులకు గురవుతున్నారని ఈ సందర్భంలో పోషకాలతో కూడిన సమతుల్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో మిల్లెట్స్ సాగును చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఐసీడీఎస్‌లో చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని అందించడం ద్వారా 3-6 సంవత్సరాల పిల్లలకు, గర్భిణీ, బాలింతలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి కుటుంబ సభ్యులకు సరిపడినంత వారి పంట పొలాల్లో సేద్యం చేయడం జరుగుతుందని చెప్పారు.. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయబడుతున్న గుడ్లుపై పటిష్ట పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ఉదాసీనంగా వ్యహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నియమ నిబంధనలు మేరకు గుడ్డు 50 గ్రాములు బరువు ఉండాలని, ఆ ప్రకారం గుడ్లు సరఫరా చేయని కాంట్రాక్టర్లుపై పీనల్ యాక్షన్ తీసుకోవాలని తెలిపారు. విత్తనాలు సరఫరా, పంటల సాగుపై క్షేత్రాస్థాయిలో పటిష్ట పర్యవేక్షణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శిశు సంక్షేమ అధికారిణి వరలక్ష్మీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శిరీష, సీడీపీఓ షబాన, సూపర్వైజర్ వసీనా, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ మోహన్, ఎన్జీఓ సాయినాధ్ తదితరులు పాల్గొన్నారు.