Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చర్ల
మెరుగైన వైద్యం కోసం పోరాటం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంకు చక్కని ఉదాహరణ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపు దుర్గా ప్రసాద్ అన్నారు. గత మూడు రోజులుగా మండల కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం), కేవీపీఎస్, వ్యకాస నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని దుర్గాప్రసాద్, సీపీఐ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల లేకపోవడం వలన నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే మండల కేంద్రంలో మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు సూచించారు. ప్రజా వైద్యం కోసం చేపడుతున్న రిలే నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్షలుగా మారకముందే ప్రజా ప్రతినిధులు, అధికారులు వైద్య సమస్యలు తీర్చాలని వారు పునరుద్ధరించారు. తొలుత ప్రజా సమస్యలను గుర్తించి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించిన రామారావు, చంటి, శ్యామల వెంకటేశ్వర్లు, ఊడుగుల శిరోనిలను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొండా చరణ్, ఉపసర్పంచ్లు శివ లక్ష్మీనారాయణ, విద్యాసాగర్, సత్యనారాయణ, భోళ్ళవినోద్ తదితరులు ఉన్నారు.